Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కుప్పకూలిన శిక్షణ విమానం

it2

చెల్లాచెదురైన శకలాలు
ఒక మహిళా పైలట్‌కు స్వల్పంగా గాయాలు
సిద్దిపేటజిల్లా దుద్దెడ వద్ద ప్రమాదం

కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం, దుద్దెడ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘనటలో పైలెట్ రాశి రెహన స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రం నుంచి మధ్యాహ్నం 1.30కు శిక్షణ విమానం బయలు దేరింది. 2.10 నిమిషాలకు సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ స్థలానికి కొద్ది దూరంలో కూలిపోయింది. ఇందుకు కొద్ది సెకన్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ రాశి రెహనా పారాచూట్‌తో విమానం నుంచి బయటపడింది. విమానం భూమిని ఢీకొట్టగానే పెద్ద పేలుడుతో ముక్కలు కాగా కొన్ని అక్కడే కాలిపోయాయి. విమానం భూమిని తాకిన చోట దాదాపు ఐదు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. పారాచూట్ సహాయంతో దిగిన పైలట్ రాశి రెహనకు స్వల్పంగా గాయాలు కావడంతో పాటు ఎడమ కాలు విరిగింది. వెంటనే స్థానికులు ఆమెను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు నిర్వహించిన తరువాత ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ హెలిక్యాప్టర్‌లో ఆమెను హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలు ఇంత వరకు తెలియనప్పటికీ వైమానిక అధికారులు, పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమాన శకలాలను ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థలిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ వి.శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద కారణాలపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నారని, సంఘటన జరిగిన స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారని ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదని తెలిపారు. ప్రమాద స్థలాన్ని తహసీల్దారు ఆరిఫా, సిద్దిపేట డిసిపి నరసింహారెడ్డి, ఎసిపి ట్రాఫిక్ బాలాజిలతో పాటు కుకునూరుపల్లి ఎస్సై లు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే వందలాది మంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Comments

comments