Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కుప్పకూలిన స్టాక్‌మార్కెట్

STOCK

ముంబయి: దేశీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. వరుస నష్టాల్లో నుంచి కాస్త బయటపడ్డ అనుకునేలోపే.. మరోసారి అమెరికా మార్కెట్లు దేశీయ సూచీలను కలవరపెడుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌  ప్రారంభంలోనే కుప్పకూలిన సూచీలు.. భారీ నష్టాల్లో కొసాగుతున్నాయి. శుక్రవారం నాటి ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి కూడా 10,500 దిగువన ట్రేడింగ్‌ను ఆరంభించింది. ప్రస్తుతం 451 పాయింట్లు నష్టపోయి 33,962 వద్ద, నిఫ్టి 135 పాయింట్ల నష్టంతో 10,442 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్‌, టెలికాం షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 4శాతం పతనమైన అమెరికా మార్కెట్లు మదుపర్లు ఈక్విటీ నుంచి బాండ్ల మార్కెట్‌ వైపు మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీగా పడిపోయాయి. డోజోన్స్‌ దాదాపు 1000పాయింట్లు కోల్పోయింది. ఎస్‌ అండ్‌ పీ 500 కూడా 3.8శాతం పడిపోయింది. నాస్‌డాక్‌ కూడా భారీ నష్టాలతో ముగిసింది.

Comments

comments