Home తాజా వార్తలు ఏప్రిల్ 25లోగా పక్కా రైతు సమాచారం

ఏప్రిల్ 25లోగా పక్కా రైతు సమాచారం

Partha-Saradhi
మన తెలంగాణ/: హైదరాబాద్: వచ్చే నెల చివరిలోగా రాష్ట్రంలోని రైతులందరి వివరాలు జిల్లాల వారీగా సేకరించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. వాటిని ఎన్‌ఐసి రూపొందించిన వెబ్‌పోర్టల్‌లో ట్యాబ్‌ల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు ఆప్‌లోడ్ చేయాలన్నారు. ఈ సమాచారం ఆధారంగానే భవిష్యత్ పథకాలు రూపుదిద్దుకుంటాయని సిఎం కెసిఆర్ చెప్పారని తెలిపారు. సచివాలయం నుంచి శనివారం ఆయన జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల అబ్జర్వర్‌గా పనిచేస్తున్న కమిషనర్ రాహుల్ బొజ్జా అక్కడి నుంచే విసిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి సంబంధిచిన సమగ్ర సమాచార సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
39 అంశాలతో కూడిన నమూనా పత్రంలో పార్ట్ ఎ, పార్ట్ బిగా రైతుల వివరాలను సేకరించాలన్నారు. ఇందులో రైతుల చదువు, వారు పండించే పంటలు, నీటి పారుదల సౌకర్యాలు, నేలలు, వ్యవసాయ యాంత్రీకరణ, పంట రుణాలు, పంట బీమా,సేంద్రియ వ్యవసాయం మొదలగు అంశాలను పూర్తి స్థాయిలో సేకరించాలన్నారు.
అలాగే రైతుబంధు, రైతుబీమా, పిఎం కిసాన్ పథకాల గురించి వివరించారు.
రైతుబీమా పథకం అమలులో ఉన్న సమస్యల్ని సమీక్షించారు. ఆధార్‌లోని పేరు, ఎల్‌ఐసి పాలసీలో పేరు వేరు వేరుగా ఉండటం, నామినీకి సంబంధించిన వివరాలలో తప్పులు ఉండటంతో ఆలస్యమైన క్లయిమ్స్ వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

collect the farmers all Details district wise