Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గడువులోగా పనులు పూర్తి..

 Collector Amrapali Said  provied Rs 665 crore for 2019 years amrapali

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షే మ పథకాల అమలును నిర్థేశించిన సమయంలో ప్ర ణాళికను రూపొందించుకొని సకాలంలో పూర్తి చేయా లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టర్లతో పాటు వైద్యారోగ్యశాఖ, విద్య, వ్యవసాయం, గిరిజన సంక్షేమం, స్త్రీ,శివుసంక్షేమ శాఖ, స్వచ్ఛ సర్వేక్షన్ పథకాలపై ఆయన సమీక్షించారు. ఆయా జిల్లాల్లో అక్టోబర్ 2నాటికి పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ( ఓడిఎఫ్) జిల్లాగా అవార్డు అందుకున్నందుకు జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటాను ఆయన అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో వరంగల్ జిల్లా 2016 నుంచి 2019 సంవత్సరాలకు గాను రూ.665 కోట్ల కేటాయించడం జరిగిందని, ఈ పథకం ద్వారా డంపింగ్ యార్డు నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధం మొదలైన వాటికి పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వైద్య,ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న ఆరోగ్య లక్ష్మి సేవలు మరింత విజయవంతంగా అమలు చేయటానికి ప్రభుత్వ ఆసుప్రతులలో ప్రసవాలు పెరిగేందుకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ వివరాలు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. బాలింతలకు అందిస్తున్న కేసిఆర్ కిట్స్ అందజేయటానికి అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు వివరాలు సకాలంలో అందించాలని అన్నారు. విద్యాశాఖలో విద్యాప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్నభోజన పథకం సక్రమంగా అమలు జరిగే విధంగా జిల్లా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలని సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా నిర్వహిస్తున్న హాస్టల్ విద్యార్థులకు వసతి సౌకర్యాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలని, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్యలక్ష్మి పథకాలు సక్రమంగా అమలు అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

Comments

comments