Home వనపర్తి అంగన్‌వాడీల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం

అంగన్‌వాడీల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం

వేతనాలు పెంచారు ..బాధ్యతగా పని చేయండి..

                     Collector-of-Wangparthy

పెబ్బేరు: అంగన్‌వాడీల నిర్వ హణ మరింత మెరుగవ్వాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు . మంగ ళవారం మండల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామంలో మాడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రం లో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ,పోషకా హారాన్ని ఆమె పరిశీలించారు. కలెక్టర్ తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కేంద్రంలో విద్యార్థు లు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎక్కడున్నారని కలెక్టర్ ప్రశ్నించ డంతో ఇప్పుడిప్పుడే విద్యార్థులు వెళ్లిపోయారని టీచర్లు హైమావతి, ప్రభావతి తెలిపారు. సమ యాని కంటే ముందే వెళ్తారా అని గద్దించారు.

తె లంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్‌వా డీ టీచర్లకు వేతనాలు పెంచారని బాధ్యతల పట్ల నిర్లక్షం వహించడాన్ని అంగన్ వాడీ టీచర్లు హై మావతి, ప్రభావతిలను నిలదీశారు. పోషకాహా రం తో బాధ పడ్తున్న విద్యార్థుల కోసం అంగన్ వాడీ కేంద్రాల పని తీరు మెరుగవ్వాలని ఆమె హెచ్చరించారు. మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా కేంద్రాల పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు. కలెక్టర్ వస్తున్న విషయం ఎవ్వరికి తెలియక పోవడంతో ఆమె కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్న సమయంలో జనం పోవ డంతో అటు నుండి వెళ్లిపోయారు.కలెక్టర్‌తో పా టు జిల్లా అధికారి వరప్రసాద్  పాల్గొన్నారు.