Home జాతీయ వార్తలు శభాష్ కలెక్టరమ్మ…. ఎన్నికల సామాగ్రిని మోసిన కలెక్టర్

శభాష్ కలెక్టరమ్మ…. ఎన్నికల సామాగ్రిని మోసిన కలెక్టర్

 

తిరువనంతపురం: పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పని ఎక్కువగా ఉంటుంది. అదే కలెక్టర్ అయితే కిందిస్థాయి సిబ్బందితో పని చేయిస్తోంది. కేరళలోని త్రిశ్మూర్ కలెక్టర్ టివి అనుపమ ఎన్నికల సిబ్బందితో పాటు తాను ఎన్నికల సామాగ్రి పెట్టెలను మోసింది. వాహనం నుంచి పెట్టెలను దించి ఆఫీసులో పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్ సదరు కలెక్టర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి కొందరు కలెక్టర్ అంటే ఇలా ఉండాలని, పని చేస్తూ సిబ్బందికి పని చేప్తున్నారని, హ్యాట్సాఫ్ కలెక్టర్ అని మెచ్చుకున్నారు. 

 

Collector Anupama Carry Heavy Voting Equipment in Kerala

 

 

 

Courtesy by One India