Home జోగులాంబ గద్వాల్ పద్దతి మారకపోతే.. ఇంటికే

పద్దతి మారకపోతే.. ఇంటికే

                             Collector

గద్వాలప్రతినిధి: మీరు మారరా…? ఎన్నిసార్లు చెప్పాలి… మళ్లీ వచ్చినపుడు ఇలాగే ఉంటే ఇంటికే పోతారు… అంటూ జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. గురు వారం కలెక్టర్ జిల్లా ఏరియా ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్‌ను చూసిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బిత్తరపోయ్యారు… గజగజ వణ కుతూ హడావిడి చేశారు.

అయితే వీరి హడావిడిని గమనించిన కలెక్టర్ పద్దతి మార్చుకోవాలంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగారు. రోగులతో నేరుగా మాట్లాడారు. సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటివలీ ప్రారంభించిన చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. ఆసుప త్రి సిబ్బంది వివరాలను అడిగితెలుసుకున్నారు. హాజరుపట్టిను పరిశీలించారు. అధేవిధంగా ఆసుపత్రి ముందు భాగంలో ఇష్టానుసారంగా నిలిపి ఉన్న వాహనాల విషయంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అధే విధంగా ఆసుపత్రి ప్రాంగణం కూడ అపరిశుభ్రంగా ఉండడం గమనించి ఆసుపత్రి సూపరిండెంటు కు చీవట్లు పెట్టారు. నేను మళ్లీ వచ్చినపుడు ఇలా కనిపించరాదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. మొత్తానికి కలెక్టర్ అకస్మిక తనిఖీ పట్ల రోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఉన్నతాధికారులు వచ్చిపోతుంటే వైద్యులు, సిబ్బందికి భయం ఉంటుందని మాకు మంచి చికిత్స లభిస్తుందన్నారు.