మనతెలంగాణ/కామారెడ్డి: మాచారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తనిఖీ చేశారు. భూ ప్రక్షాళన రికార్డులు, పంపిణీ కాని పాసు పుస్తకాలు, సాదా బైనామాలు, పౌతి, ఆదారు సమస్య ఆగిపోయిన ఖాతాలను పరిశీలించారు.
అన్ని రకాల సమస్యలను పరిష్కరించి రైతులకు వెంటనే పాసు పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. ఖాతాలను సరిచేసి అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామల, నాయభ్ తహసీల్దార్ శాంత తదితరులు పాల్గొన్నారు.