Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నిర్లక్ష్యం తగదు

Collector Darma Reddy Speech About Yedupayalu Area

ఏడుపాయల విస్తీర్ణానికి సంబంధించి పూ ర్తిస్థాయి మ్యాప్ తయారు చేయాలని ఆదేశించినా ఎందుకు నిర్లక్షం వహిస్తున్నార ని ఈవోపై కలెక్టర్ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుపాయల అభివృద్ధిపై మంగళవారం వివిధ శాఖల అధికారుల తో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పారిశుద్ధానికి సంబంధించిన సమీక్షాసమావేశం ఏడుపాయలలో నిర్వహించినప్పుడు వివిధ నిర్మాణాలకు సం బంధించి స్థల పరిశీలన చేయడంతో పాటు ఏడుపాయల పూర్తిస్థాయి విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్ తయారు చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు మ్యాప్‌తో పాటు స్థల పరిశీలన ఎందుకు చేయలేదని ఈవోపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. పారిశుద్ధ నిర్వహణకు సంబంధించి తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని ఆదేశించామని, అందుకు సంబంధించి నిర్వహణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఏడుపాయలలో ఉన్న ప్రతి దుకాణానికి 2 బుట్టలను పంపిణీ చేయాలని ఆదేశించామని కలెక్టర్ ప్రశ్నించారు. ఈవో పర్యవేక్షణ లేకుండా తడి, పొడి చెత్త సేకరణ విజయవంతం కాదని, తప్పనిసరిగా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గతంలో స్లాటర్ హౌజ్, టాయిలెట్స్ నిర్మా ణం, పార్కింగ్ కొరకు స్థలాలను గుర్తించాలని ఆదేశించినా నిర్లక్షం చేయడంపై మండిపడ్డారు. పార్కింగ్ చేయడానికి స్థలమే లేనప్పుడు పార్కింగ్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలు తీశారా అని ప్రశ్నించారు. ఏడుపాయల ప్రాంతమంతా గుట్టలతో నిండివుండడం ఉందని కలెక్టర్‌కు తెలుపగా… సాకులు చెబ్తూ పనులు తప్పించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపిడివోతో కలిసి హరితహారం విజయవంతానికి కార్యాచరణ రూపోందించాలని, రిజర్వు ఫారెస్టుల్‌లో మొక్కల పెంపకానికి ప్రభుత్వ అనుమతించినందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడుపాయల ఈవో మోహన్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఇఇ ఏసయ్య, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లుతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హెల్త్‌కార్డుల పంపిణీ : సమీక్షాసమావేశం అనంతరం డిఆర్‌డిఎ ఉద్యోగులందరికి మంజూరైన హెల్త్‌కార్డులను కలెక్టర్ తన చాంబర్‌లో ఉద్యోగులకు అందజేశారు. ఇందులో డిఆర్‌డిఎ పిడి వెంకటరెడ్డి ఉన్నారు.

Comments

comments