Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కొలతల్లో తప్పులు తగవు

Collector Darmareddy Meeting With MRO sన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : గ్రీవెన్స్ రిజిస్ట్రర్‌లో నమోదైన భూ సమస్యలను నాలుగుల రోజుల్లో సర్వే జరిపి పంచనామా నివేదికలను తహసీల్దార్లకు అందజేయాలని కలె క్టర్ ధర్మారెడ్డి సర్వేయర్లను ఆదేశించారు. సోమవారం కలె క్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమంలో భాగంగా పట్టాదా రు పాసు పుస్తకాలను పంపిణీ చేసే సమయంలో గ్రీవెన్స్ రిజిస్టర్‌లో నమోదైన భూ సమస్యలన్నీంటిని 4 రోజుల్లో సర్వే జరిపి సంబంధిత పంచనామా రిపోర్టులను తహసీ ల్దార్లకు అందజేయాలని సర్వేయర్లకు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా భూప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదే శాలు ఉన్నందున ఈ సర్వే రిపోర్టులను త్వరితగతిన పూర్తిచే యాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లు ఉన్నచోట వారికి ఏవైనా సందేహాలు ఉన్నచో సీనియర్ సర్వేయర్ల సహకారం తీసు కోవాలన్నారు. అవగాహన లేకుండా తప్పుడు కొలతలతో లేని సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ సర్వేయర్ల ఉన్నచోట డిఐ లేదా ఏడి లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

గ్రీవెన్స్ రిజిస్ట్రర్‌లో అధికంగా పట్టాభూమిలో హెచ్చుతగ్గుల గురించి నమోదయ్యాయని, వాటిని సంబంధిత సర్వేయర్లు తప్పని సరిగా భూమిని కొలిచి, కొలత ప్రకారం సర్వే రిపో ర్టులను తహసీల్దార్‌కు ఇవ్వాలని, అనంతరం తహసీల్దార్ ప్రోసిడింగ్ పత్రాలను భూ యాజమానులకు  అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభు త్వ, అసైన్డ్ భూమిలో హెచ్చు తగ్గులు ఉన్నట్లైతే సీత్వార్ ప్రకారం భూమి ని గుర్తించాలని ఆదేశించారు. హెల్ప్ లైన్ ఫిటిషన్ల్ ద్వారా భూమి కొలి చేందుకు దరఖాస్తు చేసుకున్న రైతులను ఇబ్బందులకు గురి చేయ కుండా కొలతలను పూర్తి చేసి పంచనామ రిపోర్టులను రైతులకు అందజే యాలని ఆదేశించారు. భూ కొలతల కోసం రైతుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేయర్ల తీరుపట్ల అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఏ అధికారి పట్లైనా రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తమకు సంబంధించిన వ్యక్తులకు ఒకలాగా, వేరే రైతులకు మరోకలాగా కొలతల్లో వివక్ష చూపి స్తే సహించేది లేదని, పాత పద్దతి మానుకోవాలని సర్వేయర్లకు సూచిం చారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా సర్వేయర్లతో సమీక్షాసమావేశం ని ర్వహించి పనుల ప్రగతి నివేదికపై సమీక్షించాలని జెసి నగేష్‌కు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మెదక్ ఆర్డీవో నగేష్‌గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడి గంగయ్య, మెదక్ తహసీల్దార్ యాదగిరి, హవేళిఘనపూర్ తహసీల్దార్ సత్యనారాయణతో పాటు సర్వేయర్లు పాల్గొన్నారు.

Comments

comments