Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పారిశుద్ధ్యంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Collector

మెదక్ మున్సిపాలిటి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి అన్నారు. శుక్రవారము నాడు ఆమె పట్టణంలోని 12వ వార్డులో ఉద యం 7 గంటలకే ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధం పనులను పర్యవేక్షించి, కాలనీ లో ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో పారిశుద్ధం సరిగా లేకుంటే అంటు వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని అందువల్ల ప్రతిఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్ర వంతంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ఉదయం 7 గంటలైన ప్పటికీ వీధి దీపాలు వెలగడంపై కమీషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా నిర్లక్షం వహిం చడం వల్ల విద్యుత్ బిల్లులు మున్సిపాలిటీకి భారంగా మారుతాయని ఆమె అన్నారు. ప్రజ లు మున్సిపాల్ వాహనాలలోనే చెత్త వేయాలని, రోడ్లపై వేసిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భాగస్వా మ్యంతోనే పారిశుద్ధంపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని ఇందుకు వార్డుల వారిగా పారిశుద్ధ కమిటీలను వేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపాల్ కమీషనర్‌ను ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, డ్రైనేజీ లలో ప్లాస్టిక్, చెత్త చేదారం వేసిన వారిపై నిఘా ఉంచి జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకుని రింగులు వేయకుండా డ్రైనేజీలకు వదలడానిన ఆమె పరిశీలించి తక్షణమే రింగులు ఏర్పాటు చేసుకోలేని వారికి గడువునిస్తూ నోటీసులు జారీ చేయాలని కమీషనర్‌ను ఆదే శించారు. కలక్టర్ వెంట స్థానిక కౌన్సిలర్ అయితారం నర్సింలు, కమిషనర్ ప్రసాద్‌రావు, రామేశ్వర్‌రావు, ఇంజనీర్ చిరంజీవులు, ఇతర అధికారులు ఉన్నారు.

Comments

comments