Home జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

Mulugu District Collector C. Narayana Reddy

 

ములుగు: జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందజేసేందుకు ఏ గ్రేడ్ 1770, సి 1750 రేటుతో ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాలను కొనుగోలు చేస్తుంది. గ్రామాల్లో రైతులు పండించిన పంటను దళారులకు అమ్మకుండా మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని అన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతులే రాజులు కావాలనే ఉద్దేశ్యంతో రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఒ సంజీవ రావు, ఎపిడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Collector launched a government procurement center