Search
Wednesday 26 September 2018
  • :
  • :

కలెక్టర్ మార్నింగ్ వాక్!

Collector1

కమాన్‌పూర్: పొద్దు పోడవక ముందే వాక్ షూట్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణీ కమాన్‌పూర్‌లో బుధవారం ప్రత్యక్షమయ్యారు. కమాన్‌పూర్ టూ పెంచికల్‌పేట రోడ్డుకు ఇరు వైపుల హరితహరం క్రింద నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కల్లో 70 శాతంకు పైగా బ్రతికి ఉన్నప్పటికినీ వాటికి సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుర్రకాయలపల్లెలో ఇంటికో మరుగుదొడ్డి ఉన్నప్పటికినీ బయట మలవిసర్జనకు వెళ్లడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం పెంచికల్‌పేటలో వన నర్సరీ స్థలాన్ని పరిశీలించారు. నర్సరీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా పిడి అంజనేయులు, ఎంపిడిఓ మూడు రాజు, సర్పంచ్‌లు కోంతం సత్యనారాయణ, సాగంటి లక్ష్మి, ఎంపిటిసి తాళ్ల శంకర్, నాయకులు ఇనుగంటి రామారావు, సాగంటి లక్ష్మణస్వామి, ఎపిఓ రమేష్‌బాబు, టిఎ తిరుపతి, క్షేత్ర సహయకులు రాజయ్య, కుమార్ తదితరులు ఉన్నారు.

Comments

comments