Home కామారెడ్డి బాలికా విద్యతో కుటుంబానికే వెలుగు

బాలికా విద్యతో కుటుంబానికే వెలుగు

Collector Ramohan Visit the Aielapoor Govt School

మనతెలంగాణ/నందిపేట: బాలికలు చదువుకుంటే ఆ బాలికతో పాటు ఆ కుటుంబానికే వెలుగు వస్తుందని జిల్లా కలెక్టర్ రాంమోహన్‌రావు అన్నారు. బడిబాటలో భాగంగా మంగళవారం మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ బడీడు పిల్లలందరిని పాఠశాల లో చేర్పించాలనే ఉద్దేశ్యంతోనే  5 రో జుల పాటు నిర్వహించే ఈ బడిబాటలో రోజు కు ఒక పద్ధ్దతి ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం  బాలికా విద్యా దినోత్సవంగా  ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తం గా సోమవారం ఒక్కరోజే 2822 మంది బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం జరిగిందన్నారు. అయిలాపూర్‌లో 12 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం  పదవ తరగతిలో ప్రై వేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించామని ఆ యన అన్నారు. 93.1శాతంతో రాష్ట్రంలోనే జిల్లా నాలుగవ స్థా నంలో నిలిచిందన్నారు. విద్యార్థులు ఇఫ్టంతో చదివి దాన్ని ఆకళిం పు చేసుకుంటే మంచి భవిష్యత్తు మీదేనన్నారు.

ప్రపంచ పర్యావారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని వాడకం క్రమక్రమంగా తగ్గించాలని సూచించా రు. అనంత రం పాఠశాల ఆవరణలో పూలమొక్కలు నాటారు. అనంతరం పాఠశాలలోని ప్రతీ గదిలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్, డిజిటల్ తరగతులను పరిశీలించారు. ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన గురించి విద్యార్థులను ప్రశ్నించారు. బాగా చదవాలని ఆయన విద్యార్థుల కు సూచించారు. అయిలాపూర్‌లో అభివృద్ధ్ది పనులకుగాను ఇసుకతో ఇబ్బందులు ఎదురైతున్నాయని కనుక మండలంలో ఉన్న మూడు ఇసుక క్వారీల నుండి అనుమతి ఇ వ్వాలని సర్పంచ్ సుదర్శన్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు ఆన్‌లైన్‌లో టిఎస్‌ఎంఐడిసి ద్వా రా ఇసుకను పొందేందుకు వీలుందన్నారు. డిఇఓ రా జేష్ మాట్లాడుతూ బాలికల చదువుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చే స్తుందన్నారు. ఆడపిల్లల అవసరాలను గుర్తించి హెల్త్ కిట్‌లను అం దజేస్తుందని దీంతో కేజిబివిలోని విద్యార్థినులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. అలాగే వారిస్వీయ రక్షణ కొరకు జిల్లాలోని 269 పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్‌లో 3 నెలల పాటు శిక్షణనిచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా అయిలాపూ ర్ పాఠశాలలో అన్ని తరగతుల్లో డిజిటల్  క్లాసులు నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు. ఉపాధ్యాయులు వి ద్యార్థులకు విద్యాబోధనలో మంచి సహకారాన్ని అందించి ము న్ముందు మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యమున, జడ్పీటిసి స్వాతి, స్థానిక సర్పంచ్ మీసాల సుదర్శన్, ఎంపిడిఓ నాగవర్ధన్, తహసీల్దార్ ఉమాకాంత్, ఎంఇఓ శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.