Search
Monday 24 September 2018
  • :
  • :

ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధ్ది వైపు పయనించాలి

Collector RamohanRao Speech About SC,ST Devlopments

మనతెలంగాణ/ నిజామాబాద్‌బ్యూరో : ఓ వైపు వారికి కల్పించిన హక్కుల ద్వారా రక్షించుకుంటూ మరోవైపు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చే సుకోవడం ద్వారా ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధ్ది వైపు ప యనించాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు తెలిపారు. శనివారం నిజామాబాద్ గ్రామీణ మం డలం ఆకుల కొండూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైతే ప్రజల వి వక్ష, అణచివేత, ద్వేషభావాలు, భేద భావాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ, స్నేహభావంతో జీవిస్తారో ఆ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, ప్రశాంతం గా ఉంటుందని ఆ ప్రజలు సంతోషంగా జీవిస్తారన్నారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అండగా నిలవడానికి వారి కొరకు ఎన్నో చట్టాలు, హక్కులు, సంక్షేమ, అభివృద్ధ్ది పథకాలు అమలు చేస్తున్నదన్నారు. వీరిని అంటరానివారిగా పరిగణించినా, దూరంగా ఉంచి నా, వీరిని అన్యాయానికి, అక్రమాలకు గురిచేసిన సంబంధిత వ్యక్తులపై చట్టం ప్రకారం శిక్షించడానికి రాజ్యాంగంలో చట్టాలు తీసుకువచ్చిందన్నారు. అన్యాయం జరిగినప్పుడు ఉచి త న్యాయసహాయం, అత్యాచారాలు జరిగినప్పుడు పు నరావాస ఏర్పాటు చేయుటకు చట్టం చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకొనుటకు ప్రతి ఒక్కరికి అవగాహ న అవసరమని తెలిపారు. ఈ ప్రజలు సా మాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధ్ది చెందుటకు వీరికొరకు ప్రత్యేకంగా పథకలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ అణగారిన వర్గాల పిల్లలు విదేశాల్లో చ దువులకు వెళ్లడానికి తోడ్పాటునందిస్తుందని వివరించారు. వీటి ఫలితాలు బాగా వస్తున్నాయని పేర్కొన్నారు.
* ఆకుల కొండూరును ఇతర గ్రామాలు స్ఫూర్తిగా తీసుకోవాలి :
ఆకుల కొండూరులో ఇంత వరకు ఎస్సీ, ఎస్టీలపై అణచివేత, అక్రమాల కేసులు లేకపోవడం గ్రామ ప్రజలు కలిసిమెలిసి వివక్ష చూపకుండా జీవించడం చాలా మంచి పరిణామమన్నారు. ఈ గ్రామ ప్రజల్లోని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని, కలుపుగోలుతనాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో వ్యవసాయ అధికారుల సలహాలు పొంది మట్టి నమూనాల ద్వారా భూసార పరీక్షలు చే యించుకోవాలని, సేంద్రీయ వ్యవసాయానికి అలవా టు పడాలని, తద్వారా రసాయనాలు లేని కల్తీలేని ఆ రోగ్యకరమైన పంటలు పండడానికి అవకాశాలు ఏర్పడతాయని, ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుందని అన్నారు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిందని, దాని ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం జరిగిందని, వాడకా న్ని తగ్గించుకోవాలన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా అనారోగ్యాలపాలు కాకుండా ఉం డడానికి వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని పౌరుల్ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇ.డి ఎస్సీ కార్పొరేషన్ శశికళ, డిడి భూమయ్య, ఆర్డిఓ వినోద్‌కుమార్, సిఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ అశోక్, ఎంపిపి రాజు, తహసీల్దార్ సు దర్శన్, ఎంపిడిఓ సంజీవ్‌కుమార్, అధికారులు, గ్రా మ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments