Search
Saturday 22 September 2018
  • :
  • :

మోడల్ కేంద్రాలుగా అంగన్‌వాడీలు: రోనాల్డ్ రాస్

Ronald-Rossమెదక్: అంగన్‌వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చేర్యాల గ్రామంలో రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్‌తో కలిసి రోనాల్డ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో 50 మంది పిల్లలకు బోధనకుగానూ ఓ గది, బాలింతల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితోపాటు వంట గది ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీలన్నింటినీ దశలవారీగా మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. దీని కోసం యునిసెఫ్ సహకారం తీసుకుంటామని రోనాల్డ్ రాస్ తెలిపారు.

Comments

comments