Home జయశంకర్ భూపాలపల్లి త్వరితగతిన డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం పూర్తిచేయాలి

త్వరితగతిన డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం పూర్తిచేయాలి

Collector Said  Fast Complete Double Bedroom Homes works

మన తెంగాణ/భూపాలపల్లి : నవంబర్ లోపు డబుల్ బెడ్‌రూంల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్‌అండ్‌బి, ఆరిగేషన్, ట్రైబల్ వెల్‌ఫేర్ ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన డబుల్‌బెడ్‌రూంల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమర్ధవంతగా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు సకాలంలో అందుతాయని అన్నారు. నిలువ నీడలేని నిరుపేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టిన డబుల బెడ్‌రూంల నిర్మాణ పనులు సకాలంలో పూర్తవుతాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3233 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా 698 మాత్రమే పూర్తిచేయడం జరిగిందని వివిధ స్థాయిలో నిర్మాణ దశలో ఉన్నా ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఇంకా ప్రారంభించని వాటిని కూడ ప్రారంభించి వెంటనే పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈకార్య క్రమంలో జిల్లా డిఆర్‌ఒ పి మోహన్‌లాల్, జిల్లా కన్సెల్టెంట్ కృష్ణ మూర్తి, ఆర్‌అండ్‌బీ ఇఇ ఆనంద్ కుమార్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.