Home తాజా వార్తలు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

Collector

 

మన తెలంగాణ/కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి
విక్రం గౌడ్‌ను సోమవారం కలెక్టర్ శ్వేతామహంతి సస్పెండ్ చేశారు. గ్రామంలో 301 మరుగుదొడ్లు మంజూరు కాగా, 33 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారని, మరో 92 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా, 76 మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరైనప్పటికి మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభించడంలో కార్యదర్శి విక్రంగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవరెడ్డిలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సస్పెండ్ చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడంతో కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యా లయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యదర్శి విక్రం గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవ రెడ్డిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

 

 

Collector Sweta Mahanti Suspend to Panchayat Secretary