Search
Sunday 18 November 2018
  • :
  • :

బడిబాటపై విద్యార్థులకు కలెక్టర్ అవగాహన

Collector Talking With Students About Education

మనతెలంగాణ/కామారెడ్డి/కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ జడ్‌పి హైస్కూల్లో బడిబాటలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందరంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యానికి ఆట పాటల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. అన్నింటా విద్యార్థు లు ముందుండాలన్నారు. బడి బాటలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించి ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. స్కూల్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటి హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. ‘నా మొక్క నా హక్కు’పై రూపొందించిన కర పత్రాన్ని విడుదల చేశారు. విద్యార్థులు వారానికి ఒకసారి కృత్రిమ ఎరువును వాడాలని అన్నారు. 15రోజులకు ఒకసారి చెట్టు పెరుగుదలను స్కేలు తో నమోదు చేయాలన్నారు. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలన్నా రు. మొక్కల పెంపకంపై 15 రోజులకు ఒకసారి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలన్నారు. మొక్కలు మనుషుల నుండి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రాణవాయువును మనుషులకు అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒ ఎల్లయ్య హెడ్ మాస్టర్ భూమయ్య సైన్ ఆఫీసర్ సిద్ధరాం రెడ్డి, ఉపాధ్యాయులు సేనాపతి గంగా కిషన్, శకుంతలాదేవి పాల్గొన్నారు.
బడుల డిజిటలైజేషన్ కోసం బిడియల్ కృషి
కామారెడ్డి జిల్లాలోని అన్ని బడులను డిజిటలైజేషన్ చేయడానికి శుక్రవారంనాడు కలెక్టర్ కార్యాలయంలో బిడియల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ యంపి బిబిపాటిల్ ప్రోత్సాహంతో జిల్లాలోని అన్ని స్కూల్‌లను దశలవారీగా డిజిటలైజేషన్ చేయడానికి ఒప్పందం కుదిరింది. జిల్లాలోని 614ప్రాథమిక పాఠశాలలు 114 ప్రాథమిక ఉన్నత పాఠశాలలలో డిజిటల్ విధ్యలు అందించడానికి బిడియల్ సాకారం అందిస్తుందని సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఒ శ్రీనివాస్, జిల్లా విధ్యాశాఖ ఎడి నందు సుకేషిని, నోడల్ ఆఫీసర్ మనోహర్, బిడియల్ చైర్మెన్ ఉదయ భాస్కర్ సంస్థ ప్రతినిధులు బి.శ్రీనివాస్, ఛీనా, యోగానంద్, కృష్ణవర్థన్ పాల్గొన్నారు.

Comments

comments