Home సంగారెడ్డి కలెక్టరే టీచర్

కలెక్టరే టీచర్

                          Teacher

ఝరాసంగం: మండల పరిధిలోని బిడెకన్నె పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ మాణిక్య రాజ్ కణ్ణన్ 7, 8తరగతి గదిలో వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ బోర్డుపై విద్యార్థుల ఒకరి పేరు, మరోకరితో రాయించారు. సుద్దముక్క తీసుకుని కూడికలు తీసివేతలు రాసి విద్యార్థులతో చేయించారు. విద్యార్థుల ప్రగతి గ్రేడు నిర్ణయించే జవాబు పత్రాలను చూపించమని తెలిపారు. ఏ ఒక్కరి గ్రేడు నిర్ణయించే జవాబు పత్రాలు సక్రమంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశా రు. పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్, విద్యాకమిటీ చైర్మన్, ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సదానందం, ఎంపిడిఓ ఎల్లయ్య, సర్పంచ్ యాదమ్మ తదితరులు ఉన్నారు.