Home జిల్లాలు కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

hydసిటీబ్యూరో : ప్రకృతిని పరిమళ్లింపజేసే పువ్వులనే దేవతగా భావించి తమను చల్లగా చూడాలని కోలుచుకుంటూ చేసుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక అని జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రాంగ ణంలోజ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలను లాంఛనంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత గొప్ప పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ ఉత్సవాన్ని మహిళా ఉద్యోగులందరూ ఒక్కచోట చేరి సంఘటితంగా నిర్వహించుకుంటున్నామన్నారు. 9రోజుల పాటు సామూహి కంగా జరుపుకునే ఈ పండుగ వల్ల మనుషుల మధ్య అత్మీ యత, సుహృద్బావం పెంపొందడమే కాకుండా ఆయా ప్రాంతాల అలవాట్లు పద్దతులు తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో భారీ బతుకమ్మలను తయారు చేసి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జీ ఎజెసి వి.అశోక్ కుమార్, టిజిఓ జిల్లా అధ్యక్షులు ఎం.బి. కృష్ణ యాదవ్, సిపిఓ ఎ.బలరాం, డిఎస్‌ఓ రాథోడ్, శిశు మహిళా సంక్షేమశాఖ పిడి ఆశ్రిత, రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు వేణు గోపాల్, సెక్రటరీ యూనస్, పరిపాలనాధికారి జపురుద్దీస్, బి. సెక్షన్ సూపరింటెండెంట్ రాధికా రమణి, నర్సయ్య పాల్గొన్నారు.