Home జిల్లాలు కలెక్టరేట్‌ను ముట్టడించిన భూ నిర్వాసితులు

కలెక్టరేట్‌ను ముట్టడించిన భూ నిర్వాసితులు

meetingనల్లగొండ టౌన్ : డిండి, దామరచర్లలో గల యాదాద్రి పవర్‌ప్లాంట్ కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రాజె క్టుల కింద భూములు కోల్పోతున్న రైతాంగాన్ని సమగ్ర నష్టపరి హారం, పునరావాసం 2013 చట్టం ప్రకారం అమలు చేయా లని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకు ండా అరెస్ట్‌లు లాఠీచార్జీలతో ఉద్యమాలు అణిచివేయడం సరైం దికాదని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమ లుచేసి భూ నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న కుటుంబాలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల కింద నష్టపరి హారం రైతులకు చెల్లించిన తర్వాతనే భూ సేకరణ చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ వెలు పలికి వెల్లడానికి ప్రయత్నించిన సంఘటనలో తోపులాట జరి గింది. పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఈ ధర్నా లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లొడంగి శ్రవణ్, పి. దేవేం దర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కంబాల శ్రీని వాస్, కొ ప్పోజు సూర్యనారాయణ, మర్రిగూడెం సిపిఐ మండల కార్య దర్శి ఈదుల భిక్షంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బుర్రి శేఖర్, ఐత గోని వెంక టయ్య, ఎరుకల యాదయ్య, నల్లబోతు కొమర య్య, గుని గంటి సోమయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లునా గార్జున్‌రెడ్డి, సిపిఎం మనుగోడు డివిజన్ కార్యదర్శి సిహెచ్. భూపాల్‌రెడ్డి, లక్ష్మమ్మ, లాలమ్మ, యాదమ్మ ఉన్నారు.