Search
Saturday 22 September 2018
  • :
  • :

చెత్తను తొలగించండి సారూ..

Dust

చెత్తను తొలగించని అధికారులు
ఇబ్బందుల్లో ప్రజలు
పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్ టౌన్: స్వచ్ఛ యావత్ భారత్ మొత్తం అన్నీ ప్రాంతాలలో పట్టణాలలో, గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్న సందర్భంలో ఆ పరిస్థితులకు భిన్నంగా పట్టణంలోని స్థానిక తాజ్ నగర్ అన్వర్ స్కూల్ ఎదుట మరియు పలు ప్రాంతాలలో చెత్త పెరుకుపోవడంతో కాలనీవాసులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి చెత్తకుప్ప గురించి ఎన్ని సార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకొనేవారు కరువయ్యారని కాలనీ వాసులు వాపోతున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, చెత్తపై నివసించే దోమలు, క్రిమికీటకాల వలన అనేక రోగాలకు గురవుతున్నామన్నారు. తప్పని పరిస్థితులలో చెత్త పక్క నుండి వెళ్లవలసి వస్తుందని కలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తకుప్పని తీసి వేయించాలని వారు తమ అవేదను వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఆ దారిగుండా నడుస్తూన్న చిన్నలు పెద్దలు రాత్రి విధి లైట్లు లేకా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చీకట్లో ఈ కాలనీ వెంట వెళ్లాలంటే ఏ ప్రాంతంలో ఏముందో అని భయపడుతూ నడువ వలసిన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా మహిళలు వీధి దీపాలు లేక పోవడంతో చీకలి పడితే చాలు ఈ ప్రాంతంగుండా ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తమ బాధను వ్యక్త పరుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి అధికారులు వస్తు న్నారు చూసి వేలుతున్నా రు కానీ సమస్యను పరి ష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని వారు వాపొ తున్నారు. వేంటానే సమస్యను పరిష్కరిస్తా మంటు న్నారే తప్ప ఆ మాటలు మాటలకే పరిమితం అవుతున్నాయి కాని సమస్య ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్నాట్లు ఉందిని ఇకనైనా అధికారలు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరు కుంటున్నారు.

స్థానిక అన్వర్ పాఠశాల ముందు ఉన్న చెత్త గత నెల రోజులనుండి తొలగించకపోవడం తో దుర్వాసన వస్తుంది. ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు విన్నపించిన సమస్య పరిష్కరించ లేదు. ఇప్పటి కైనా స్పందించి ము న్సిపల్ అధికారులు వెంటనే చె త్తను తొలగించాలని కోరుకుంటు న్నాము. – నిఖిల్

చెత్త కుప్ప పెరుకుపోయి గత నెలరోజులు గడుస్తూన్న ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించ లేదు మున్నిపల్ బిల్లు లు మా త్రం వసూళ్లకు వస్తారు కాని కాలనీలోని సమస్యలను పట్టించుకోవడం లేదని తమ అవేదన వ్యక్తం చేసారు. కాలనిలో రోడ్డుపైన లైట్లు లేవు. గతంలో లైట్లు ఉండేవి ఇప్పుడు సాయం త్రం 7 అయితే చాలు ఈ దారికుండా పో యేవారు తీవ్ర ఇబ్బందులకు గురికావాలిసిన పిరస్థితి అధికా రలు స్పందించి కాలనిలో లైట్లు చెత్త తొలగించాలని కోరుకుంటు న్నామన్నారు.
– అజీమ్

మా ఇంటి పక్కన ఉన్నా చెత్తకుప్ప మరియు వీధి లైట్లు కూడా లేకా కాలనీ వాసులు ఇబ్బందులు ప డాల్సి వస్తుంది మున్సిపల్ అధి కారలుకు గతంలో వీధి లైట్లు కొర కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆయినా ఎవ్వరు పట్టించు కోవ డం లేదు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి వెంటనే చెత్తను తొలగించి వీధి లైట్లు ఏర్పాటు చేయ్యాలని వారు తమ అవేదన వ్యక్తం చేసారు.
– ఇందిరాల సాయిరామ్

Comments

comments