Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రొమాంటిక్ డ్రామాలో స్వాతి

Colours-Swathiకలర్స్ స్వాతిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన స్వాతి ఓ ఏడాది కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని లీడ్ రోల్ చేసిన ‘త్రిపుర’ మూవీ ఫెయిల్ కావడం ఆమెని బాగా నిరాశపరిచింది. సినిమా బాగానే ఉన్నా ఎప్పుడూ క్యూట్ రోల్స్‌లో స్వాతిని చూసిన ప్రేక్షకులు ఆమె దెయ్యంగా చేయడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి చాలా స్క్రిప్ట్ విన్న స్వాతి ఇప్పటికి ఓ సినిమాకు అంగీకరించినట్టు తెలిసింది. ఆదిత్య అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. గతంలో ‘క్షణం’ మూవీ చేసిన రవికాంత్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిత్య… సింగిల్ సిట్టింగ్‌లోనే స్వాతిని ఒప్పించేశాడట. రొమాంటిక్ డ్రామాగా రూపొం దిన ఈ స్క్రిప్ట్‌లో హీరోయిన్‌గా చేసేందుకు  ఆమెను ఒప్పించాడట ఆదిత్య. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి పాత్రలతో ఆకట్టుకున్న స్వాతికి ఈ రొమాంటిక్ డ్రామాలో డిఫరెంట్‌గా కనిపిస్తుందట. అయితే ఈ చిత్రానికి ఆమె ఇంకా సైన్ చేయలేదని తెలిసింది. అయితే వేసవిలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ రొమాంటిక్ మూవీలో స్వాతి భాగం కావడం లాంఛనమే అని… ఆమె ఈ స్క్రిప్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉందని టాక్.

Comments

comments