Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెళ్లి పీటలెక్కనున్న స్వాతి

Colours Swathi To Marry A Pilot

కలర్స్ స్వాతి తాను వలచిన సఖుడిని పెళ్లాడేస్తూ అభిమానులకు షాక్‌నివ్వబోతోంది. స్వాతి పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. తన స్నేహితుడు, ప్రియుడు అయిన వికాస్‌ని మనువాడేందుకు రెడీ అవుతోంది. ఈనెల 30న సాయంత్రం హైదరాబాద్‌లో ఈ వివాహం జరుగనుంది. వరుడు వికాస్ ఓ పైలెట్. మలేసియా ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు. ఇండోనేషియా జకార్తాలో నివాసం ఉంటున్నాడు. అతను స్వాతిని ఇలా పెళ్లాడి అలా ఫ్లైటెక్కించేస్తాడట. అంటే ఇకమీదట స్వాతి ఇండియాలో ఉండదు. ఇండోనేషియా జకార్తా కోడలుగా అక్కడే స్థిరపడిపోతుందట. అంతకంటే ముందు పెళ్లయిన తర్వాత సెప్టెంబర్ 2న కొచ్చిలో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది. కలర్స్‌తో బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్వాతి ‘అష్టాచెమ్మా’తో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆతర్వాత ఆమె గోల్కొండ హైస్కూల్, డేంజర్, త్రిపుర చిత్రాలతో ఆకట్టుకుంది. 100% లవ్ చిత్రంలో ఏ స్కేర్ బి స్కేర్ అంటూ ఓ పాట కూడా పాడి అభిమానులను అలరించింది స్వాతి.

Comments

comments