Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అందుకే జనసేనలో చేరలేదు: అలీ

అందుకే జనసేనలో చేరలేదు: అలీ

Ali and YS Jaganహైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు అలీ ఇటీవల వైసిపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అలీ వరుసగా చంద్రబాబు, జగన్, పవన్ లను కలిశారు. దీంతో అలీ రాజకీయ అడుగులు గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కు అలీ మంచి మిత్రుడు కావడంతో జనసేనాలో చేరడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, అలీ అనూహ్యంగా వైసిపి కండువా కప్పుకున్నారు. ఇదిలాఉంటే తాజాగా ఆయన జనసేనలో చేరకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. మా మధ్య స్నేహాన్ని రాజకీయాలు, సినిమాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని అనుకుంటున్నా. అంతేగాక పవన్ కూడా నన్ను జనసేనలోకి రమ్మని పిలవలేదు అని అలీ వివరించారు. అందుకే వైసిపిలో వెళ్లానని చెప్పుకొచ్చారు. ఇక రాబోయే ఎన్నికల్లో కేవలం వైసిపి తరఫున ప్రచారం మాత్రమే చేస్తానని, పోటీ చేయడం లేదని తెలిపారు. పార్టీ కోసం సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు.

Comedian Ali Comments On Janasena Party