Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భారత మార్కెట్‌లోకి కోమియో ఎక్స్1 స్మార్ట్‌ఫోన్

phone

ముంబయి: మొబైల్స్ తయారీదారు కోమియో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ కోమియో ఎక్స్1 ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ నూతన స్మార్ట్ ఫోన్ రూ.7,499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఒక్కోటి రూ.50 విలువైన 44 వోచర్లు ఈ క్యాష్‌బ్యాక్‌లో భాగంగా వస్తాయి. ఇందుకు గాను కస్టమర్లు రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లను రీచార్జి చేసుకోవాలి. ఇక ఐడియా సెల్యులార్ ఈ ఫోన్‌పై నెలకు 10 జిబి చొప్పున 6 నెలలకు గాను మొత్తం 60 జిబి డేటాను ఉచితంగా అందిస్తున్నది. ఇందుకు కస్టమర్లు రూ.199 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి.

కోమియో  ఎక్స్1 ఫీచర్లు..

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, 3050 ఎంఎహెచ్ బ్యాటరీ

Comments

comments