Home హైదరాబాద్ ఉరివేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

ఉరివేసుకుని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Committed suicide intermidiate student
వనస్థలిపురం: మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అర్ధవరం గ్రామానికి చెందిన గుత్తివల్లి సత్యనారాయణ భార్య కృష్ణవేణితో పాటు కూతురు, కొడుకుతో కలిసి వనస్థలిపురం సచివాలయనగర్‌లో గత 15సం.లుగా నివాసం ఉంటున్నాడు. సత్యనారాయణ కూతురు నాగసాయి ప్రసన్నలక్ష్మీ(17) శ్రీ గాయత్రి జూనియయర్ కళాశాలలో ఎంపిసి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కాగా.. నాగసాయి ప్రసన్నలక్ష్మీ గత కొద్ది కాలంగా మానసికంగా వ్యక్తిగత కారణాల వలన మనస్థాపానికి గురై శుక్రవారం తెల్లవారు జామున 4.30లకు ఇంట్లో ఫ్యాన్‌కు తన చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రలో ఉన్న తల్లిదండ్రులు తెల్లవారుజామున  లేచి చూసేసారి నాగసాయి ప్రసన్నలక్ష్మీ చనిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.