Home జాతీయ వార్తలు రైతు ఆత్మహత్యలపై  కమిటీలు ఏర్పాటు చేయండి

రైతు ఆత్మహత్యలపై  కమిటీలు ఏర్పాటు చేయండి

HIGHCOURTరెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై జనవరి 4 లోగా నివేదికలను సమర్పించాలని హైకోర్టు రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది.కేవలం రుణాల మాఫీతో రైతుల ఆత్మహత్యలు ఆగవని కూడా హైకోర్టు స్పష్టం చేసింది., రైతుల ఆత్మహత్యల నివారణకు కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలంగాణ.ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. రైతుల ఆత్మహత్యలపై నిపుణులతో సమావేశం నిర్వహించి,,మూలకారణాలను చర్చించాలని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.అన్ని అంశాలపై చర్చించి తగు పరిష్కార మార్గాలతో రావాలని హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే,జస్టిస్ ఎస్వీ.భట్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ప్రజాహిత వ్యాజ్యాలపై సోమవారం విచారణ చేపట్టి,ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి గల మూల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్ కోదండరాం తరఫు న్యాయవాది బి.రఛన అభ్యర్థిం చారు. హైకోర్టు నేతృత్వంలో ఇంతవరకు ఎలాంటి కమిటీని నియమించలే దన్నారు. ఈ వ్యవహారంపై పరిశోధన చేసేందుకు గతంలో సామాజిక సంస్థలు, జిల్లా కలెక్టర్లను బాంబే హైకోర్టు ఆదేశిందని నివేదించిన ఆ న్యాయవాది కోర్టు ఉత్తర్వుల ప్రతిని ధర్మాసనానికి అందజేశారు.దీనిపై తాత్కాలిక సీజే స్పందిస్తూ …..ఆ న్యాయవాది చేసిన ప్రతిపాదనను ప్రభు త్వం ఎందుకు ఆమోదించరాదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదనలు వినిపిపిస్తూ…రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం రుణాల మాఫీ,వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, ఆత్మహత్యల నివారణ కోసం అన్ని చర్యలను తీసుకుంటుందని విన్నవించారు..