Home ఆఫ్ బీట్ హెల్మెట్‌తో అపోహలు

హెల్మెట్‌తో అపోహలు

ఆడపిల్లలైనా, మగవారైనా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించటం తప్పనిసరి.  కొంతమంది అమ్మాయిలు జుట్టు చెరిగిపోతుందని అయిష్టంగానే వాటిని ధరిస్తున్నారు. ఇంకా కొంతమంది జుట్టు రాలిపోతుందని, తలనొప్పి వస్తుందని, బట్టతల వస్తుందని అనేక అపోహలు పడుతున్నారు. వారిలో ఇలాంటి భయాలు పోవటానికి పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని చూద్దాం…

HELMET2

హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. తలకు ఆక్సిజన్ అందక జుట్టు రాలిపోతుందని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. హెల్మెట్‌లు బిగుతుగా ఉండటం కంటే వదులుగా ఉండే హెల్మెట్‌లు వాడితే మంచిది. దుమ్ము, చెమటతో నిండిన హెల్మెట్ వల్ల స్కాల్ఫ్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. అందుకని వారానికి ఒకసారి యాంటీ బయోటిక్స్‌తో హెల్మెట్ ను శుభ్రం చేసి ఎండలో ఆరనివ్వాలి.

ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు గంటకి ఒకసారైనా హెల్మెట్‌ను తీసి తలకు గాలి తగలనివ్వాలి. తల బిగుతుగా అనిపిస్తే మునివేళ్ళతో కాసేపు మర్దనా చేయాలి. కొంతమంది తలకి కర్ఛీఫ్ పెట్టుకుంటారు. దానిని బిగుతుగా ధరించకూడదు. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చుండ్రు, దురద సమస్యలున్నవారు హెల్మెట్‌లో కర్చీఫ్ వాడటం మంచిది. ఇతరుల హెల్మెట్‌ను ధరించడం మంచిదికాదు. ఇంటికి వెళ్లినా, ఆఫీసుకు వెళ్లినా హెల్మెట్‌లు బండికే వదిలివేస్తారు. ఆ అలవాటు మంచిదికాదు. క్రిమికీటకాలు దాంట్లో చేరతాయి. హెల్మెట్‌ను పరిశుభ్రమైన ప్రాంతంలోనే ఉంచాలి.