Home నల్లగొండ కొనేదెట్లా.. తినేదెట్లా..

కొనేదెట్లా.. తినేదెట్లా..

Compared to double prices before the ten days

పది రోజులతో పోలిస్తే రెట్టింపు ధరలు
మాట వినని టమాటా..ఘాటెక్కిన మిర్చి
ఏది కొన్నా కిలో రూ.30 పై మాటే
ఆకాశాన్నంటుతున్న ధరలు
సామాన్యులు కొనలేని పరిస్థితి
వంద పెట్టినా..ఒక్కరోజుకు సరిపడని కూరగాయలు

మన తెలంగాణ/ హాలియా: కూరగాయల సాగు విస్తీ ర్ణం తగ్గుతుండటంతో ధరలు ఆకాశాన్నం టుతు న్నా యి. దీంతో సామాన్యుడు కూరగాయలను కొనలేని పరిస్థితి దాపురించింది. కూరగాయల దిగుబడి తగ్గి పో తుండడంతో వాటి ధరలు ఆమాంతం పెరిగాయి. కిలో టమాట రూ.30, పచ్చిమిర్చి రూ.50, బెండ కాయ రూ.40, బీరకాయ రూ.60, క్యారెట్ రూ.50, క్యాబెజీ రూ.30, బీన్సు రూ.50, ఆలుగడ్డ రూ.30, బీట్‌రూట్ రూ.40 ఇలా ప్రతీ కూరగాయల ధరలు రూ.30 పైనే ఉంది. ఆకుకూరలు సైతం మండిపో తు న్నా యి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పూదీనల వంటి పలు ఆకుకూరల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు కూరగాయలు కొని తినే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులతో పాటు,కూరగాయల ధరలు కూడా భగ్గుమంటుండడంతో సామాన్యులు ఆం దోళన చెందుతు న్నారు. మే నెలలో ట మా ట కేవ లం రూ.20ల కు దొరికేది. అది జూన్ నెల కు వచ్చేటప్పటికి రూ.30 లకు చేరి ంది. రూ.30 ఉన్న పచ్చి మిర్చి రూ.50 లకు చేరింది. సామాన్య ప్రజలు కొను గోలు చేయాలంటే జంకు తున్నారు. అటు కూరగాయల ధరలు, ఇటు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఏం కొనేటట్లులేదు..ఏం తినేటట్లు లేదు.