Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పరిహారం అందాకే పనుల ప్రారంభం

stand

మన తెలంగాణ/కౌటాల : ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు బ్యారేజి నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. బ్యారేజి నిర్మాణ స్థలం, నీటి సాంద్రత, ముంపు ప్రాంతం, నీటి మళ్లింపు పూర్తి వివరాలను నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజి నిర్మాణ స్థలం మ్యాప్‌ను పరిశీలించారు. మూడు నెలలుగా పనులు ఎందుకు ప్రారంభించలేదని, పనుల వివరాలు ఎందుకు చెప్పలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భూములు నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని, ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. పరిహారం వెంటనే అందేలా చూస్తానని, రైతుల పూర్తి వివరాలను, భూమి పట్టాదారుల వివరాలు, నావునిపీపీ భూముల వివరాలను వెంటనే  అందించాలని ఆర్‌డిఒ రమేష్‌బాబును ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్‌డిఒ రమేష్‌బాబు, ఇరిగేషన్ డిఈ వేణుగోపాల్, నూర్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments