Home జోగులాంబ గద్వాల్ ప్రభుత్వ మెడలు వంచైనా నష్టపరిహారం తెస్తాం

ప్రభుత్వ మెడలు వంచైనా నష్టపరిహారం తెస్తాం

Kodanda-ramవడ్డేపల్లి: నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు దీనిపై ప్రభుత్వం కఠినమైన చ ర్యలు తీసుకోవడంలేదని రాజకీయ ఐకాస రాష్ట్ర అధ్యక్షు లు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. శుక్రవారం శాంతినగర్‌లో నడ్డిగడ్డ రైతు గర్జన సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రోఫెసర్ కోదండరాం అలంపూర్ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్ రిటైర్డ్ జస్టిస్ చం ద్రకుమార్ తెలంగాణ శాంతిదళ్ రాష్ట్ర అధ్యక్షులు సంగం రెడ్డి పృధ్వీరాజ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు ల కోసం ప్రత్యేక చట్టం తీసుకోస్తె నకీలి విత్తనాలకు అడ్డు కట్ట వేయవచ్చాని కోదండరాం పేర్కోన్నారు. ముఖ్యంగా గ్రామీణ రైతుల పైననే ప్రభుత్వలు నడుస్తున్నాయన్నారు. కష్టాల్లో ఉన్న కంపెనీల కోసం రైతులను బెదిరించి పోలా లను లాక్కునడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వేల ఎకరా లలో ఫార్మా కంపెనీలను నిర్మిస్తే అక్కడ పంటలు దెబ్బతి నడమేకాకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటాయన్నారు.

అందుకే ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు గ్రామాల్లో రైతుసంఘాలు ముందుకు వచ్చి పోరాటం చేయాలన్నా రు. రైతులు ఆత్మహత్య చెసుకుంటున్నారని  హైకోర్టు కూ డా వెళ్లమన్నారు. వందలమంది రైతులు చనిపోతుంటే ప్ర భుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండి ప డ్డారు.అధేవిధంగా ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్ మాట్లా డు తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నష్టపరి హా రం అందించాలని లేదంటే రైతులకు  మేలు జరిగేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. అధేవిధంగా తుమ్మిళ్ల ఎత్తిపోతలను సాధించి ఇక్కడి రైతులకు మేలు జరిగే వరకు విశ్రమించమని పేర్కో న్నారు.

ఒకపక్క గుండ్రేవుల ఎత్తిపోతల నిర్మాణం జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపో తూ నటిస్తుందని ధ్వజమెత్తారు. రిటైర్ట్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతులు ఇదే తరహాలో ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే రైతులే లేకుండా పోయ్యో ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కాపాడలేని ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదని విమర్శించారు. కార్యక్రమంలో కాంత్రిదల్ రాష్ట్ర అధ్యక్షు లు పృద్వీరాజ్, జేఏసీ రాష్ట్ర నాయకులు రాజేందర్‌రెడ్డి, నాగర్‌దొడ్డివెంకట్రాములు, వెంకట్‌రెడ్డి, నాగేష్, వీరేష్, రంజిత్, కొంకలభీమన్న, రాంమోహన్, గోపాల్‌రెడ్డి, హరి, జగన్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మోహన్‌రాజారాం, నాగరాజు,వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.