Home తాజా వార్తలు బిసిసిఐకి భారీ జరిమానా

బిసిసిఐకి భారీ జరిమానా

BCCI-2

ముంబయి: ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బిసిసిఐకి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్(ఐపిఎల్) మీడియా హక్కుల వేలంలో అక్రమాలు జరిగాయని బిసిసిఐకి ఏకంగా రూ.52.24 కోట్ల జరిమానా వేసింది. ఐపిఎల్ మీడియా హక్కుల ఒప్పందంలో ఓ అభ్యంతర క్లాజ్‌ను బోర్డు కావాలనే ఉంచిందనేది కాంపిటిషన్ కమిషన్ ఆరోపణ. ఈ మేరకు 44 పేజీల ఆర్డర్ కాపీని బోర్డుకు పంపించింది. గత మూడేళ్లలో బోర్డు సగటు టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకొని అందులో 4.48 శాతం అంటే రూ.52.24 కోట్లను జరిమానాగా విధించింది. కాగా, గత మూడేళ్లలో బోర్డు సగటు టర్నోవర్ రూ.1164 కోట్లుగా ఉంది. ఇంతకుముందు 2013లో కూడా బిసిసిఐకి రూ.52 కోట్ల జరిమానా పడిన విషయం విదితమే.

Competition Commission of India slaps Rs 52 crore fine on BCCI.