Home వనపర్తి జాతీయ జెండాను అవమానించిన ఎంపిడిఒపై ఫిర్యాదు

జాతీయ జెండాను అవమానించిన ఎంపిడిఒపై ఫిర్యాదు

BJP-Leader

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు

పెద్దమందడి: ఎందరో యువకుల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమాన పర్చిన పెద్దమందడి ఇంచార్జీ ఎంపిడిఒ సత్య నారాయణరెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని పెద్ద మందడి బిజెపి మండలాధ్యక్షుడు శివారెడ్డి శుక్రవారం పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఉదయం 8.55 గంటలకు జెండావిష్కరణ కార్యక్రమం ఉండగా తన స్వంత నిర్ణయం తీసుకొని కెటాయించిన సమయం కంటే ముందే జెండాను ఆవిష్కరించడంతో పాటు జెండా ఆవిష్కరణ దగ్గర వందే మాతరం గీతాలాపన చేయకుండానే కార్యక్రమం నిర్వహించారని, కాబట్టి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే గతంలో కూడా జెండా వందనం కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఘనత సత్యనారాయణరెడ్డికే దక్కిందని జెండా ఆదరా బదరాగా ఎగరేసి అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి వాహనంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పోవడంలో ఆంతర్యమేమిటని కలెక్టర్ వెంటనే స్పందించి ఎంపిడిఓపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ముప్పురి చెన్నయ్య, గోవర్దన్, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.