Home హైదరాబాద్ జబర్దస్త్ చమ్మక్‌చంద్రపై పోలీసులకు ఫిర్యాదు

జబర్దస్త్ చమ్మక్‌చంద్రపై పోలీసులకు ఫిర్యాదు

Chamak-chandra

మన తెలంగాణ/అంబర్‌పేట : ఈ టివి షో జబర్‌దస్త్ ప్రొగ్రాంలో వచ్చే చమ్మక్‌చంద్ర గంగపుత్రుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించాడని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ శనివారం తెలంగాణ రాష్ట్ర(బెస్త)గంగపుత్ర సంఘం నాయకులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఎపి.ఆనంద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ఈటివిలో వచ్చే జబర్‌దస్త్ ప్రోగ్రాంలో శుక్రవారం రాత్రి వచ్చిన షోలో గంగపుత్రులను కించపరిచే విధంగా చేపల మార్కెట్‌లో ఉన్నవాళ్లను సాఫ్ట్‌వేర్ కార్యాలయంలో తెచ్చిపెట్టుకున్నానంటూ వ్యంగ్యంగా హేళన చేస్తూ మాట్లాడడాన్నారు. గంగపుత్రులు సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేయకూడదా అని అవేదన చెందారు. గంగపుత్రుల భావాలను కించపరిచిన ఆయనను అరెస్ట్‌చేయాలని ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యకార్యనిర్వాహక కార్యదర్శి మెట్టుధన్‌రాజ్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు చంద్రకాంత్,గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు నూతికట్టు జానకి,నాయకులు దేవేందర్, పెంటం ధర్మేందర్,చేగూరి శ్రీకాంత్, కొమ్ము శ్రీనివాస్, సింగితం సాయికుమార్, ముడారి శ్రీనివాస్, వేణు, దీపక్, నిఖి ల్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు