Search
Wednesday 21 November 2018
  • :
  • :

కలెక్టరేట్‌లో ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

kkkk

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి కలెక్టర్ ఎం.వి.రెడ్డి వినతులు స్వీకరించారు. ప్రధానంగా వృద్దాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, రెండు పడకల ఇళ్ల మంజూరు తదితర అంశాలకు సంబంధించి మొత్తంగా 91 ఫిర్యాదులు అందాయి. హరితహారంలో భాగంగా గొర్రెల కాపరుల సౌకర్యార్ధం తుమ్మ చెట్ల పెంపకం చేపట్టాలని బిజెపి గొర్రె కాపరుల విభాగం ఆధ్వర్యంలో కీసర మండల బిజెపి అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గ్రామంలో సేకరించిన చెత్తను నిల్వ చేసే నిమిత్తం డంపింగ్‌యార్డుకు స్థలం కేటాయించాలని సర్పంచ్ కె.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
నిజాంపేట్‌లో ఆలయాన్ని కూల్చడంపై ఆందోళన
గండిమైసమ్మ మండలం నిజాంపేట్ గ్రామంలో నిర్మాణంలో ఆలయాన్ని ఉన్న ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేయడం పట్ల జిల్లాలోని వివిధ ప్రాంతా లకు చెందిన ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు, భక్తులు ఆందోళన చేపట్టారు. ఆలయం కూల్చివేతపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారు కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న మల్కాజి గిరి ఎంపి మల్లారెడ్డి ఆందోళన కారులను సముదాయించారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎంపితో కలిసి ఆందోళనకారులతో మాట్లాడిన కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆలయ కూల్చివేతపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

comments