Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హరితహారానికి బల్దియా సన్నాహాలు

Complete arrangements for planting plants in 1327 areas

1327 ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి
నాటే మొక్కలకు జియో ట్యాగింగ్ 

మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షల మొక్కలు నా టడానికి జిహెచ్‌ఎంసి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ 40 లక్షల మొక్కల్లో 5 లక్షల మొక్కలను జిహెచ్‌ఎంసి ద్వారా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 1327 ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంట నాటుతుండగా, మిగిలిన 35 లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిం ది. జిహెచ్‌ఎంసి ద్వారా ఇప్పటికే 60 వేల మొక్కలను నాటారు. జిహెచ్‌ఎంసి నాటనున్న 5 లక్షల మొక్కలకు సంబంధించి, స్థలాల ఎంపిక చేయడంతో పాటు వాటిని జియోట్యాగింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 455 స్థలాలను జియో ట్యాగింగ్ పూర్తయ్యింది. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం ముమ్మరంగా సాగుతుందని అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి ద్వారా నాటనున్న 5 లక్షల మొక్కల్లో ఎల్‌బినగర్ జోన్‌లో 95వేలు, చార్మినార్ జోన్‌లో 65 వేలు, ఖైరతాబాద్ జోన్‌లో 79, 600, శేరిలింగంపల్లి జోన్‌లో 85,2 50, కూకట్‌పల్లి జోన్‌లో 1,01,050, సికింద్రాబాద్ జోన్‌లో 74,100 మొక్క లు నాటడానికి ఏర్పాట్లు చేపట్టారు. మొక్కలు నాటేందుకుగాను 3,60, 88 0 హెక్టార్ల భూమిని సుమారు 2వేల ప్రాంతాల్లో గుర్తించారు. వీటితో పాటు నగరవాసులకు ఉచితంగా పంపిణి చేయడానికి నిర్ధేశించిన 35లక్షల మొక్క ల్లో ఎల్.బి.నగర్,చార్మినార్ జోన్‌లలో 7 లక్షల చొప్పున, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ లో 5 లక్షలు, సికింద్రాబాద్‌లో 6లక్షల చొప్పున మొక్కలను కేటాయించారు. ఇప్పటికే కొన్ని జోన్‌లలో పాఠశాల విద్యార్థులకు మొక్క ల పంపిణి ప్రారంభించారు.

34 నర్సరిల్లో మొక్కల పెంపకం…
జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34 నర్సరిల్లో 40 లక్షల మొక్క లు సిద్దం గా చేశారు. జిహెచ్‌ఎంసి నాటనున్న 5 లక్షల మొక్కల్లో 2,92, 404 మొక్కలు 5 అడుగులకుపైగా ఎత్తుగల ఉన్నాయి. ప్రధానంగా ఈ మొక్కల్లో వేప, జువ్వి, కానుగ, జమ్మిలతో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషద మొక్కలను ఉచితంగా పంపిణి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు అన్నారు.

మొక్కల మనుగడకు చేయూతనివ్వండి….
గ్రేటర్ హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి ద్వారా నాటే మొక్కల పరిరక్షణలో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఇందుకుగాను కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ట్రీ గార్డ్‌లను జిహెచ్‌ఎంసికి అందచేయాలని వివిధ సంస్థలకు అధికారులు విజ్ఞ ప్తి చేశారు. ట్రీగార్డ్‌ల తయారీ, వాటి ధర, లభ్యమయ్యే వివరాలను జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం జరిగిందని కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి తెలిపా. ఇప్పటికే పలు బ్యాంకులు, సంస్థలు ట్రీగార్డ్‌లను సామాజిక బాధ్యతలో అందించేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని కమిషనర్ చెప్పారు.

Comments

comments