Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తరితగతిన మిషన్ భగీరథ, రైతుబీమా పూర్తి

kadiyam-srihari-image

డిప్యూటీ సిఎం కడియం

మన తెలంగాణ / జనగామ: మిషన్ భగీరథ, రైతు బీమాను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీసీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తుందన్నారు. రైతుబంధు, భూప్రక్షాళనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూమి వివరాల నమోదు జాప్యం, తప్పులు తెలుసుకొని అధికారులు వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని కల్పించిందని, రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తుందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతల వివరాలను తెలుసుకొని వచ్చేనెల 7లోగా ఇన్సూరెన్స్‌ను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టిందని, కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరగా పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి కావాల్సిన ఇసుకను కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తెచ్చేందుకు అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఆగస్టు మొదటివారంలో రైతుకు సాగునీరు అందించేందుకు లింగంపల్లి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బండ ప్రకాశ్, జేసీసీ చైర్మన్ గాంధీనాయక్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

comments