Home రాజన్న సిరిసిల్ల వెంకటేశ్ శవానికి రీ పోస్టుమార్టం పూర్తి

వెంకటేశ్ శవానికి రీ పోస్టుమార్టం పూర్తి

rcl

వేములవాడ: సిరిసిల్ల జిల్లా వేములవాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన కడమంచి వెంకటేశ్ శవానికి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రీపోస్టుమార్టం ని ర్వహించారు. నాలుగు నెలల క్రితం కడమంచి వెంకటేశ్ పోలీసుల ఆదుపులో ఉన్న సమయం లో ఆకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుడి భా ర్య రేణుక పోలీసుల చిత్రహింసలకు తన భర్త బలయ్యాడని ఆరోపించింది. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఆ మె ఆవేదన విన్న హైకోర్టు రీపోస్టుమార్టం చే యించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెస ర్, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ డా. కృపాల్‌సింగ్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు, డిఎంఅండ్‌హెచ్ ఒ, ఆర్‌డిఒ, తహసీల్దార్, వివిధ శాఖల అధికా రుల సమక్షంలో బుధవారం మధ్యాహ్నం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ శాఖ పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి షీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నట్లు ప్రొ. కృపాల్‌సింగ్ తెలిపారు. రీపోర్టుమార్టం జరిగే ప్రదేశానికి జయవింధ్యాల, కె చంద్రన్నన, డా. ఎం షోయబ్, ఇక్భాల్, అబ్దుల్ మసూద్, మహ మ్మద్ యాకుబ్, శ్రీనివాస్, మార్వాడి సుదర్శ న్, ఆవునూరి ప్రభాకర్, కానపురం లక్ష్మణ్, గుండా థామస్, సిరిసిల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, సాగరం వెంక టస్వామి, ఆకునూరి బాలరాజు, ముడికె చం ద్రశేఖర్, కముటం అంజయ్య, తదితరులు చే రుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ వెంకటేశ కుటుంబాని కి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందిం చి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు.