Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ముగిసిన బదిలీలు

Complete Teachers Tranfer Process In Rangareddy District

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బదిలీలలో రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్న లక్షంతో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ ప్రక్రియ విజయవంతం అయింది. మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్‌తో బదిలీలు  చేయడం వలన ఇబ్బందులు వస్తాయని రాద్దాంతం చేయడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారులు మాత్రం ఆన్‌లైన్ బదిలీలకు మొగ్గుచూపడంతో పాటు విజయవంతంగా పూర్తి చేసి తమ సత్తా నిరూపించుకున్నారు. ఉపాధ్యాయ బదిలీల కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో 7374 మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది సంవత్సరాలకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారికి ప్రస్తుతం స్థానభ్రంశం కలిగింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 210 మంది, స్కూల్ అసిస్టెంట్‌లు 3383, ఎస్‌జిటిలు 3741 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. 210 మంది హెడ్ మాస్టర్‌లకు గాను 119 మంది కొత్త స్థానాలకు బదిలీ కావడంతో పాటు ఇప్పటికే కొత్త స్థానాలలో జాయిన్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్‌లు 3383 దరఖాస్తు చేసుకున్న అందులో 2348కి బదిలీ ఉత్తర్వులు రావడంతో సోమ, మంగళ వారం నాడు కొత్త స్థానాల్లో జాయిన్ అయ్యారు. ఎస్‌జిటి తత్సమాన క్యాడర్ కలిగిన వారు 3741 దరఖాస్తు చేసుకోగా వారిలో సీనియర్‌లకు మంగళవారం సాయంత్రం బదిలీల ఆదేశాలు రావడంతో బుదవారం నాడు కొత్త స్థానంలో జాయిన్ అవ్వడానికి సిద్దం అవుతున్నారు.

వికారాబాద్ జిల్లా ఖాళీ…
ఉపాధ్యాయ బదిలీల పుణ్యమా వికారాబాద్ జిల్లాలోని మెజారిటి పాఠశాలలు పంతుళ్లు లేని వాతావరణం కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లాను చార్మినార్‌లో కలపకుండా జోగుళాంభ గద్వాల జోన్‌లో కలపడంతో ఉపాధ్యాయులు చాలా మంది బదిలీల కోసం మొగ్గుచూపారు. జిల్లా పరిధిలోని గెజిటెడ్ ప్రధానోపాద్యాయులు చాలా మంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అధికంగా హెచ్‌ఆర్‌ఎ వచ్చే స్థానాలకు బదిలీపై రావడంతో సగం గెజిటెట్ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగిలాయి. 18 మండలాల్లోని 168 ఉన్నత పాఠశాలలు ఉండగా 82 బడులలో హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జిటిలు సైతం చాలా మంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు బదిలీలపై రావడంతో చాలా పాఠశాలలు ఖాళీ కుర్చిలు మిగలనున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంబంలో ఇలా జరగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఖాళీగా ఉన్న స్థానాలను ఈ నెల 20 లోపు విద్యావాలంటీర్‌లతో నింపి విద్యార్దులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంబించింది. భార్య, భర్తలు ఇద్దరు ఉపాధ్యాయులుగా ఉన్నవారికి మాత్రం బదిలీలలో ఇబ్బందులు తప్పడం లేదు. స్పౌస్ కేటాగిరిలో అదనపు పాయింట్‌లు సాధించుకున్న భర్త వికారాబాద్ జిల్లాకు బదిలీ అయితే భార్య మేడ్చల్ జిల్లాకు బదిలీ అయింది. ఇలాంటి బదిలీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. గ్రామీణ మండలాలను దృష్టిలో ఉంచుకుని బదిలీలలో తగు జాగ్రత్తలు పాటించినట్లు అధికారులు పెర్కొంటున్నారు. వెబ్ బదిలీలలో తప్పులు దొరిలిన వారు డియస్‌సిలో పది రోజులలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు హమీ ఇస్తున్నారు.

Comments

comments