Home పెద్దపల్లి కాలువల మరమ్మతులు పూర్తి చేయండి

కాలువల మరమ్మతులు పూర్తి చేయండి

 Complete the repairs of the canals

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
మనతెలంగాణ/పెద్దపల్లి:ఎస్సారెస్పి కాలువల మ రమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఎస్సారెస్పి కాలువల మరమ్మతులు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం తదితర అం శాలపై అధికారులతో శుక్రవారం స్థానిక ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పి ద్వారా పె ద్దపల్లి జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కాలువల మరమ్మతుల పనులను త్వర గా పూర్తి చేయాలని అన్నారు.
కాలువల మరమ్మతు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పనులను త్వరిత గతిన పూర్తి చేయి ంచేలా ఎస్సారెస్పి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.మరమ్మతులు జరుగుతున్న కా లువలను ఎఈలు ప్రతి రోజు సందర్శించి పనుల ను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎస్సారెస్పి ద్వారా ఖరీఫ్‌లో రైతులకు సాగు నీరందించేందుకు గల అవకాశాలను వివరించాలని కో రగా,ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 16 టిఎంసీల నీటి నిల్వ ఉన్నదని,ప్రస్తుత వర్షపాతం,పై రా ష్ట్రాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో అంచనా వేసుకుంటే సెప్టెంబర్ చివరి నాటికి సాగు నీరందించేందుకు అవకాశాలున్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఎస్సారెస్పి ప్రాజెక్టులోకి నీరు చేరే లోపు మఖ్యమైన పనులను పూర్తి చేసి, ఈ ఖరీఫ్‌లో చివరి ఆయకట్టుకు నీరందించాలని అన్నారు.పెద్దపల్లి ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్షాన్ని అధిగమించడంతో పాటు వాటిని నూరు శాతం సంరక్షించాలని అన్నారు.అందుకు అన్ని శాఖల అధికారులు  సమయ్వంతో పనిచేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజలను బాగస్వాములను చేయాలని అన్నారు. గత మూడు విడతలుగా జరిగిన హరిత హరం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ శాతం తక్కువగా ఉందని ,ఈ సారి అలా జరుగ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతు బందు కార్యక్రమంలో ,కొంత మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు,మరి కొంత మంది రైతులకు చెక్కులు అంద లేదని అర్హత కలిగిన ప్రతి రైతుకు అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి,జిల్లా ఇంచార్జి డిఆర్‌డివో ప్రేమ్ కుమార్,జిల్లా వ్యవసాయాదికారి తిరుమల ప్రసాద్,జిల్లా రైతు సమన్వయ సమితి అద్యక్షులు కోట రాంరెడ్డి, జిల్లాలోని తహసిల్దార్లు,వ్యసాయాదికారులు,ఎస్సారెస్పి ఇంజనీర్లు, పాల్గొన్నారు.