Home జగిత్యాల 20 లోగా భూరికార్డుల క్రమబద్ధీకరణ పూర్తి

20 లోగా భూరికార్డుల క్రమబద్ధీకరణ పూర్తి

completion-of-registration-of-land-records-by-20

పాస్ బుక్కులు రాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
భూరికార్డుల క్రమబద్ధీకరణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
జగిత్యాల కలెక్టర్ డాక్టర్.ఎ.శరత్

మనతెలంగాణ/ధర్మపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ భూ రికార్డుల క్రమబద్ధీకరణ ఈ నెల 20లోగా పూర్తి చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ డా. ఎ.శరత్ అ న్నారు.గురువారం ధర్మపురి తహసీల్దార్ కార్యాల యంలో జరుగుతున్న రెవెన్యూ భూరికార్డుల శుద్ధీకరణను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పాత్రికేయులతో మా ట్లాడుతూ జగిత్యాల జిల్లాలోమొత్తం2లక్షల ఐదువేల పట్టాదారు పాస్ పుస్తకాలుఇవ్వాల్సి ఉండ గా,1లక్ష 93వేల రైతులకు పాస్ పుస్తకాలు అందజేశామన్నారు. వివిధ కారణాల వల్ల 12వేల పాస్ బుక్కులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొంద రు గల్ఫ్ దేశాల్లో ఉండి పాస్ పుస్తకాలు తీసు కో క పోవడంతోరెవెన్యూ కార్యాలయాల్లోనే ఉన్నాయన్నారు.మరి కొంత మంది సరైన ఆధారుకార్డులు ఇవ్వక పోవడం వల్ల చిన్న చిన్న తప్పులు దొర్లి పాస్ పుస్తకాలుపెండింగ్‌లో పెట్టాల్సి వచ్చిందన్నారు.అదేవిధంగా కంప్యూటర్ సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని త ప్పులు దొర్లాయన్నారు.శుద్ధీకరణలో దొర్లిన తప్పులను గు ర్తించి,వాటిని సవరించి తిరిగి రైతులకు పంపిణీ చేస్తామన్నారు.ప్రతి మండల తహసీల్దార్ కా ర్యాలయాన్ని భూ రిజిస్ర్టేషన్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
శుద్ధీకరణ అనేది నిరంతర పక్రియ అని, పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లిన వారు,పాస్ పుస్తకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లే దన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల అల్లీపూర్, జగిత్యాల మండలంలోని జాబితాపూర్, బీర్‌పూర్ మండలంలోని తాళ్ల ధర్మారం, చర్లపల్లి, సారంగాపూర్ రేచపల్లి గ్రామాల్లో పనిచేసిన కొందరు అధికారుల అలసత్వం వల్ల చిన్నచిన్న తప్పులు దొర్లాయన్నారు. తప్పులు దొర్లడానికి కారుకులైన అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు జరుగుతున్న భూరికార్డుల క్రమబద్ధీకరణలో ఏమైనా తప్పులు దొర్లినట్లైతే వాటికి పూర్తి బాధ్యత తహసీల్దార్‌లదే నన్నారు. ఈ దఫాలో అధికారులు ని ర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లోపాలు సవరించడం చివర దశలో ఉందని, వాటిని కంప్యూటర్‌లో పొందు పరిచి 20లోగా పంపిణీకి సన్నాహా లు చేస్తున్నామన్నారు.ఆయన వెంట జగిత్యాల ఆర్‌డిఒ డా.నరేందర్, ఎడిఎం మమత, తహసీల్దార్ నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.