Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నేరరహిత రాష్ట్రంగా తెలంగాణ : డిజిపి

DGP

హైదరాబాద్ : తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సకల నేరస్తుల సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో జరిగిన సర్వేలో డిజిపి పాల్గొని మాట్లాడారు. నేరాలకు స్వస్తి చెప్పిన పాత నేరస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పాత నేరస్తులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్రోడీకరించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సమగ్ర సర్వే ద్వారా అందిన పూర్తి వివరాలను తెలంగాణ పోలీస్ కాప్ యాప్ ద్వారా పోలీసులకు అందుబాటుల ఉంచుతామని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comprehensive Crime Survey in Telangana

Comments

comments