Home తాజా వార్తలు గ్రంథాలయాల్లో కంప్యూటర్లు, వైఫై సౌకర్యం: కడియం

గ్రంథాలయాల్లో కంప్యూటర్లు, వైఫై సౌకర్యం: కడియం

Kadiyam-Srihari1

హైదరాబాద్: స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని విద్యాశాఖ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ….. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రతి గ్రంథాలయ సంస్థకు రూ.1.50 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలో గ్రంథాలయల్లో పోటీ పరీక్షలు పుస్తకాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయాల్లో కంప్యూటర్లు, వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి నుంచి సెస్‌కు వాటా రావాల్సి ఉందన్నారు. గ్రంథాలయాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.  గ్రంథాల‌యాల‌ను అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వాటిలో పుస్తకాలు అందుబాటులో కి తెస్తున్నామ‌ని, ఆ విధంగా పుస్త‌కాలు కొనుగోలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశామన్నారు.