Home మహబూబ్‌నగర్ కంప్యూటర్ విద్య మిథ్యేనా..?

కంప్యూటర్ విద్య మిథ్యేనా..?

గతంలో ఐటిసి ప్రాజెక్టు కింద
ఇచ్చిన కంప్యూటర్లు మాయం..
పాఠశాలలో చోరికి గురైన కంప్యూటర్లు..
ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయాయో లెక్క తెలియని విద్యాశాఖ
చేతి వాటం ప్రదర్శించిన ఇంటి దొంగలు

Computerమహబూబ్‌నగర్ ప్రతినిధి: పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య పేద విద్యా ర్థుల పాలిట మిథ్యగా మారింది. ఈ విద్య సరైనా ప్రోత్సాహం లేక ఆటకెక్కింది. కోట్ల ఖర్చుచేసి ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వం ఐసిటి ప్రాజెక్టు కింద కోట్లు వెచ్చించి కంప్యూటర్ పరికరాలతో అన్ని హంగులతో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. రోజులు గడిచిచాయి, కంప్యూటర్లు పాతబడ్డాయి. దీంతో అధి
కారులు, ప్రభుత్వ పర్యవేక్షించడం మర్చిపోయారు. దీంతో కంప్యూటర్ విద్య పూర్తిగా ఆటకెక్కింది. విద్యార్థులు ఎన్నో ఆశలు రేపిన కంప్యూటర్ విద్యా ఇప్పుడు మూలకు పడింది. మాడ్రన్ టెక్నాలజీతో అంతరిక్షంలోకి అడుగుడే నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య పేద విద్యార్థులకు అనివార్యం అని తెలిసిన ప్రభుత్వం 2008,2010 సంవత్సరాల్లో రెండు విడతలుగా ఎంపిక చేసిన పాఠశాలకు 11 కంప్యూటర్లతో పాటు 50 వేల విలువ చేసే జనరేటర్లు, కుర్చీలు, ఫ్యాన్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒక్కో పాఠశాలకు పంపిణీ చేసిన పరికరాల విలువ దాదాపుగా రూ.1.5 లక్షలు
ఉంటుంది.ఇంత విలువైన పరికరాలు చాలాచోట్ల పాడై పోయి మూలకు పడ్డాయి.

ఇంకొన్ని చోట  చోరి గురయ్యాయి. వీటిలో ఎన్ని కంప్యూటర్లు పని చేస్తున్నాయో, ఎన్ని రోరికి గురయ్యా యో, ఎన్ని ప్రస్తుతం వినియోగంలో ఉన్నా యో అన్న విషయానికి విద్యాశాఖ అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదంటే వాటి నిర్వహణపై విద్యాశాఖ ఎంత నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తుందో అర్ధమవుతుంది. ప్రాజెక్టు నడిచి న కొన్ని రోజుల మాత్రం నానా హంగామా చేసి రోజులు గడుస్తున్న కొద్ది వాటిని నిర్లక్షం చేశారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. వీటిని పర్యావేక్షించేందుకు విద్యాశాఖ అధికారులకు సైతం సమయం లేని పరిస్థితి నెలకొంది.

మరుగున పడిన కంప్యూటర్లు….

పాఠశాలల్లో కంప్యూటర్‌లతో పాటు మిగతా పరికరాల మరమ్మత్తులు చేయడానికి ప్రభు త్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో చా లా చోట్ల పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మ త్తులు, జనరేటర్‌ల సర్వీస్‌లకు నోచుకోలేదు. దీంతో వాటిని వినియోగించడం మానేశారు. అంతే కాకుండా వీటిలో చాలా చోట్ల కంప్యూ టర్లు మాయమయ్యాయి. కరెంటు సమస్యల ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనరేటర్ లు పంపిణీ చేసింది. అవి కూడా ఎక్కడ ఉన్నా యో ఎక్కడపోయాయో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. కానీ ప్రస్తుతం వాటి వినియోగం లేకపోవడంతో కంప్యూటర్ తరగతులు వినియోగానికి నోచుకోవడం లేదు. ఇలా ఎన్నో కారణాల వల్ల పాఠశాలల్లో కంప్యూటర్‌లు మూలన పడ్డాయి.

వేధిస్తున్న నిధుల కొరత…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు ఐసిటి ప్రాజెక్టులో భా గంగా కంప్యూటర్‌లను ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిక చేసిన వాటిని సరఫరా చేశా రు. కానీ వాటి నిర్వహణ నిమిత్తం నిధులు ఇ వ్వాలని ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో వాటికి మైనర్ రిపేర్లు చేయించేందు, సర్వీ సింగ్‌లు చేయించేందుకు నిధుల కొరత ఏర్ప డింది. ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని పాఠ శాలకు విడుదల చేసిన నిధులలో నుంచి వాటి వినియోగానికి వాడుకోవాల్సి వస్తుంది. విద్యా ర్థులకు తరగతులు బోధించేందుకు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాటిని ప్రా రంభంలో 5 ఏళ్ల కాల పరిమితితో నియమిం చారు. కాలం ముగియడంతో వారిని తొలగిం చారు. సిబ్బంది, నిధుల కొరతతో కోట్ల విలు చేసే కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉ న్నాయి.

ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో,  ఎన్ని పోయాయో..
సమాచారం లేని విద్యాశాఖ….

పాఠశాలల్లో కంప్యూటర్లకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఉన్న కంప్యూటరుల చాలా వరకు మాయం అయ్యాయి. అయితే వీటి విషయం లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని పోయాయో తెలి యని పరిస్థితిలో ఉన్నారు. వీటి విషయంపై విద్యాశాఖకు సమాచారమే లేదు. విద్యాశాఖా దికారులు వీటిపై కనీస పర్యవేక్షణ కూడా లే కుండా పోయింది. కంప్యూటర్లు చోరికి గుర య్యాయా… లేక ఇంటి దొంగలు చేతి వాటం ప్రదర్శించారా అన్న అనుమానాలు తలెత్తుతు న్నాయి. పాఠశాలకు రక్షణ లేనందున కం ప్యూటర్లు పోయాయో అనుకున్న దానికి సం బంధించిన సమాచారం విద్యాశాఖ వారికి అందజేయాల్సి ఉంది. కానీ వాటి విషయంలో కూడా అధికారులు ఎటువంటి సమాచారం లేదు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అంటే కోట్ల విలువ చేసే కంప్యూటర్లు ఎక్కడ పోయాయో తెలియాల్సి ఉంది.

లోపించిన పర్యవేక్షణ….

ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని ఇటు అధికారుల నుంచి కానీ పాఠశలలకు నిబంధనలు, నిర్వహణకు సంబంధించి ఎటువంటి నియమావళి అందలేదు. దీంతో ప్రాజెక్టు ఐటిసి పూర్తి కాగానే వాటిని గాలికి వదిలేశారు. అధికారులు కూడా వాటిని పట్టించుకోవడం మానేయడంతో పాఠవాలల్లో ఉండాల్సిన కంప్యూటర్లు పలువురు ఉపాధ్యాయుల ఇళ్లల్లో ఉన్నాయి. తప్పిస్తే వీటిని ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కూడా వాటి నిర్వహణకు నోచుకోకుండా పోయాయి.