Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సరిచేసేది ఇంకెన్నాళ్లు..?

 Computer operators misuse the details of farmers

మన తెలంగాణ/పాపన్నపేట : కంప్యూటర్ ఆపరేటర్లు రైతుల వివరాలను తప్పుగా నమోదు చేస్తే రికార్డుల సవరణ కార్యక్ర మం ఎలా పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌యుపి కార్యక్రమంలో భాగంగా కొత్త పాసుబుక్కులో తప్పులు దొర్లిన వాటిని సరిచేసే కార్యక్రమంలో ఎలా జరుగుతుందని కంప్యూటర్ ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నా రు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న జాబితా నుండి ఆన్‌లైన్‌లో సరిచేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు తప్పుగా నమోదు చేయడాన్ని గ్రహించి కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు. కేవలం కంప్యూట ర్ ఆపరేటర్‌లకు జాబితాను ఇచ్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని విఆర్‌వోలు చేతులు దులుపుకున్నారని, నమోదు చేసేటప్పు డు పర్యవేక్షించాల్సిన బాధ్యత లేకుంటే ఎలా అని విఆర్‌వోలపై మండిపడ్డారు. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఇంత నిర్లక్షంగా సాగుతున్నా కనీసం పర్యవేక్షణ ఎందుకు చేయలేదని తహసీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాడని నిర్లక్షంగా ఉండడం వల్లనే ఇంత పెద్ద ఎత్తన తప్పులు దొర్లాయని తహసీల్దార్‌పై అసహనం వ్యక్తపరిచారు. ప్రతి సారి రికార్డుల్లో తప్పుల సవరించాలని ఆదేశాలిస్తున్నా చేస్తామనడం మర్చిపోవడం పరిపాటిగా మారిందని ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మండంలో 750 మంది రైతుల వివరాలు తప్పుగా ఉన్నాయని వాటిని సరిచేయాలని ఎంత ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం 20 మంది మాత్రమే చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ రాములు స్పంది స్తూ… త్వరలో పూర్తి చేస్తామని తెలపారు. రెండు మూడు గంటల్లో పూర్తి చేసే దానికి రెండు మూడు నెలలైనా తాత్సారం చేస్తున్నారని కలెక్టర్ మండిపడ్డారు. పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా ఇంత నిర్లక్షం ఎందుకని, ఇప్పటికైనా చేసిన తప్పులను సరిదిద్ది సరైన వివరాలను నమోదు చేయాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామ

Comments

comments