Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించండి

కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ

Collector2

గద్వాల న్యూటౌన్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించాలని జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైనీ మున్సిపాలిటీ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అర్బన్‌డే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ ఆయా మున్సిపాలిటిల పరిదిలో ఉన్న ఆస్తిపన్ను, నీటిపన్ను, దుకాణాల, కిరాయి బకాయలు ట్రేడ్‌లైసె న్సు వసూళ్లు, మున్సిపాలిటి పరిధిలో ఎక్కువ మొత్తం బకాయిలున్న వారి జాబితాలను రూపోందించి బకా యిలున్న వారిపై రెవిన్యూ రికవరీ యాక్టుకింద నోటిసులు జారి చేసి పన్ను వసూళ్లు చేపట్టాలని అధి కారులకు సూచించారు.

అదే విధంగా చెత్త సేకరణకు సంబంధించి కాలనీవాసులకు అవగాహన కార్యక్ర మం నిర్వహించి పొడి, తడి చెత్తను వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి జనవరి 26 నుండి చెత్తను వేరు చేసే పద్దతిని అమలు చేయాలని అలాగే వేరు చేసిన చెత్తను వేసేందుకు గాను వీలుగా ఉండే డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సంబంధించిన స్థల సేకరణ చర్యలు చేపట్టాలని రెవిన్యూ, మున్సిపాల్ అధికారులకు సూచించారు.

అదే విధంగా గద్వాల పట్టణంలోని పాతహౌజింగ్ బోర్డు, కొత్త హౌజింగ్ బోర్డు కాలనీలలో పార్కులు ఏర్పాటు చేయాలని అందుకు తగిన నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. గద్వాలలోని తైబజార్‌లో పన్ను వసూలు చేస్తున్న కాంట్రాక్టర్‌కు సంబంధి ంచి వర్క్‌ఆర్డర్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాబట్టాల్సిన పన్ను బకాయిలను రాబట్టుకునేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంగీత, మున్సిపాల్ కమిషనర్ సంధ్య, అయిజ నగర పంచాయతీ కమీషనర్ వెంకన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments