Home రాష్ట్ర వార్తలు భవనాల్లో లీకేజీల నివారణకు కాంక్రీట్ యాడ్ మిక్చర్ కాన్‌లైఫ్

భవనాల్లో లీకేజీల నివారణకు కాంక్రీట్ యాడ్ మిక్చర్ కాన్‌లైఫ్

Concrete-ade-mixearమన తెలంగాణ / హైదరాబాద్ : వర్షం పడితే చాలు కొన్ని ఇళ్లు, కార్యాలయాల్లో పై కప్పు నుండి నీళ్లు లీకవుతూ ఉంటాయి. అదే విధంగా కొన్ని అపార్ట్‌మెంట్లలోని బాత్ రూంలలో నుండి నీళ్లు లీకవుతూ కింది అంతస్తులో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా లీకేజీలకు కారణం కట్టడాలలో నాణ్యమైన కాంక్రీటును వాడక పోవడమే కారణం. కట్టడాల నిర్మాణంలో సిమెంట్, ఇసుక, స్టీలు, నీరు, కంకర సరైనవి వాడితే ఆ కట్టడాలు 50 నుండి 75 సంవత్సరాల వరకు ధృడంగా ఉంటాయి. కాంక్రీటులో కలిపే నీరు.. మంచినీరు అయితే అది నాణ్యమైనదిగా ఉంటుంది. ఒక వేళ బోర్ నీరు వాడితే కాంక్రీటులో పటుత్వం తగ్గుతుంది. నాణ్యమైన మెటీరియల్‌ను వాడక పోతే ఆ ఇంటి నిర్మాణంలో లోపాలు తలెత్తి ఆ ఇంటి లైఫ్ తగ్గుతుంది. నాణ్యతలేని మెటిరియల్‌ను వాడితే 2,3 ఏళ్లకే బిల్డింగ్‌లో లోపాలు తలెత్తి స్లాబ్ డామేజి అవుతుంది. ఇలాంటి సమయంలోనే వీటిని నివారించడానికి కాంక్రీట్ యాడ్ మిక్చర్ కాన్ లైఫ్‌ను వాడాలని కాన్ లైఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాంక్రీట్‌లో సరైన మోతాదులో యాడ్ మిక్చర్‌ను కలిపితే నిర్మాణాల్లోని స్టిల్ రాడ్స్ తుప్పుపట్టకుండా నివారించడానికి వీలు అవుతుందని, అదే విధంగా కాంక్రీట్ ధృడత్వాన్ని పెంపొందిస్తుంది. కాంక్రీట్‌లో సన్నని రంధ్రాలు ఫిల్ చేయబడి లీకేజీలను పక్కాగా నిరోధిస్తుందని తెలిపింది. తర్వాత కాంక్రీట్ లైఫ్ పెరుగుతుందని, బిల్డింగ్ ఎక్కువ కాలం పాటు ధృడంగా ఉండగల్గుతుంది వెల్లడించింది. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ కమిటితో కూడా సర్టిఫై చేయబడడమే కాకుండా ఎస్‌ఎస్‌ఆర్‌లో నమోదు కాబ డిందని వెల్లడించింది. పలు ప్రభుత్వ శాఖల భవన నిర్మాణా లలోనూ కాంక్రిట్ యాడ్ మిక్సర్‌ను వాడుతున్నారని తెలిపింది. మరిన్ని వివరాలకు గాంధీనగర్‌లో ఉన్న తమ కార్యాలయాన్ని గానీ, లేదా 040-27667808, 9866386402లో సంప్రదించవచ్చని పేర్కొంది.