Home వరంగల్ డిసిసిబిపై నమ్మకం కల్పించాలి

డిసిసిబిపై నమ్మకం కల్పించాలి

eyes

వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డిసిసిబి ప్రత్యేక పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి)పై నమ్మకం కలిగిం చే విధంగా అధికారులు కృషిచేయాలని, అప్పుడే బ్యాం కుకు డిపాజిట్‌లు, పెట్టుబడులు, ఖాతాలు  పెరుగుతాయని  వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డిసిసిబి ప్రత్యేక పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం డిసిసిబిలో డిస్ట్రిక్ట్ లెవల్ మానిటరింగ్ రివ్యూ కమిటీ (డిఎల్‌ఎంఆర్‌ఎల్) సమావేశం జరిగింది. డిసిసిబి పరిధిలోని 19 బ్రాంచ్‌లకు సంబంధించిన మేనేజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ డిసిసిబిలో పెట్టుబడులు పెరగాలంటే ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవాలన్నారు. డిసిసిబిలో పొదుపు ఖాతాలు, పెట్టుబడులు పెట్టేలా రైతులకు నమ్మకం కలిగించడంతోపాటు వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే కరెంట్, పొదుపు ఖాతాలు పెంచేలా బ్యాంకర్లు ప్రత్యేక
శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. డిసిసిబిలో డిపాజి ట్ చేస్తే గతం కన్నా 0.5శాతం అదనపు వడ్డీ ఇస్తున్నట్లుగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
– రూ.320 కోట్ల టార్గెట్‌కు
రూ.257 కోట్ల డిపాజిట్
డిసిసిబిలో 2017-18 సంవత్సరానికి 320 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాలని లక్షంగా నిర్ధేశించుకున్నామని, సెప్టెంబర్ మాసాంతం వర కు 298 కోట్ల రూపాయల లక్షం సాధించాల్సి ఉండగా 257 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయగలిగామన్నారు.
ఇటీవల డిసిసిబిలో నెలకొన్న పరిణామాలపై రైతులు డిపాజిట్ చేయడానికి కొంత వెనకడుగు వేస్తారని బ్రాంచి మేనేజర్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. డిసిసిబి ఇతర బ్యాంకులాగానే సక్రమంగా నడుస్తుందని, పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. బ్యాంకు పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బ్యాంకు లాభాలలో ఉందన్నారు.
రుణాల రికవరీపై దృష్టి పెట్టండి…
డిసిసిబి బ్యాంకు పరిధిలోని వివిధ బ్రాంచిలలో రుణాలు తీసుకున్న రైతుల నుంచి డబ్బులు రికవరి చేయాలని కలెక్టర్ సూచించారు. సొసైటిలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపు లు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నా రు. అదేవిధంగా సభ్యులు సొసైటికి తిరిగి చెల్లిస్తున్న చెల్లింపుల పై పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
– అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణం …
పంట రుణం తీసుకోవడానికి అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అన్ని బ్యాంకులలో దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో రుణం మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఖాతాదారులందరికి రూపే కార్డులను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో నాబార్డు జనరల్ మేనేజర్ సత్యప్రసాద్, రీజినల్ కో-ఆపరేటివ్ సొసైటి అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, టిఎస్‌కాబ్ జనరల్ మేనేజర్ మురళీధర్‌రావు, డిప్యూటి జనరల్ మేనేజర్ ఎ.పద్మా, డిసిఓ కరుణాకర్, నాబార్డు ఎజిఎం ఎ.కృష్ణమూర్తి, డిసిసిబి సిఇఒ బి.అంజయ్య, బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.